యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
శుక్రవారం, 15 మే 2009   ( 15:47 IST )
Friends film new film
PC
కుర్‌కురే ఫేం ఇంద్ర హీరోగా, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రావణ్ బాపట్ల దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి బొద్దం ఇంద్రసేన నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

బిందు, శ్రీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తొలిషాట్‌కు పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టగా, హీరో బాబాయ్ గాదే రాజశేఖర్ స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో ఇంద్ర మాట్లాడుతూ కుర్‌కురే తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రమిదన్నారు. ఆర్టిస్టుగా 20 సినిమాల్లో నటించానని, దర్శకుడు తనపై నమ్మకంతో ఈ చిత్ర కథ వినిపించారని చెప్పారు. అది విన్నాక నిర్మాతగా తానే ఉంటేనే పాత్రకు న్యాయం చేయగలనని చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

నటి కవిత మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని అంశాలు ఉండేలా స్క్రీన్‌ప్లే తయారు చేశారని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ బంగారం తయారు చేసే విధానంతో కలిగిన ఇబ్బందులను సస్పెన్స్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించామని తెలిపారు. ఈ నెల 18 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతుందన్నారు.

ఈ చిత్రంలో జీవా, ఎం.ఎస్. నారాయణ, సూర్య, రాజేందర్, కొండవలస, ఉత్తేజ్, పృథ్వి, దువ్వాసి మోహన్, జెన్ని, దేవీశ్రీ, జయవాణి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమేరా- షమ్ము వి. ప్రభాకర్, సంగీతం- వై. సత్య, ఆర్ట్- విజయకృష్ణ, సమర్పణ- పాన్ అమెరికా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- శ్రావణ్ బాపట్ల.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రైడ్ ఆడియోను ఆవిష్కరించిన బాలకృష్ణ
విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
ఏడుకొండలవాడా వెంకటరమణ లోగో ఆవిష్కరణ
28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
ప్రభాస్, అనుష్క జంటగా ఇటీవల విడుదలైన బిల్లా చిత్రం విజయవంతంగా ప్రదర్శించ...
28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...