యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
రైడ్ ఆడియోను ఆవిష్కరించిన బాలకృష్ణ
శుక్రవారం, 15 మే 2009   ( 15:34 IST )
Ryde- audio
PC
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాణ సారథ్యంలో, రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రైడ్. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం రాత్రి హైదరాబాద్‌లోని గ్రీన్‌పార్క్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో బాలకృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి దర్శకుడు వినాయక్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూమంగమ్మగారి మనుమడు చిత్రంలోని దంచవే మేనత్త కూతురా అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశామని తెలిపారు. ఈ పాటను రీమిక్స్ చేసేందుకు అనుమతినిచ్చిన బాలకృష్ణకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన గాయకుడు హేమచంద్ర టాలెంట్ గ్రహించి సంగీత దర్శకునిగా పరిచయం చేయడం జరిగిందని ఆయన వివరించారు. అలాగే చిత్ర దర్శకుడు రమేష్ వర్మకు కూడా మంచి భవిష్యత్ ఉందని ఆయన పేర్కొన్నారు.

తాను నిర్మాతగా ప్రవేశించడానికి శ్రీహరి అవకాశం కల్పించారని అలాగే తన నిర్మాణ సంస్థ అయిన శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ ప్రేక్షకులకు దగ్గరకావడానికి బాలకృష్ణ కారణమని బెల్లంకొండ వెల్లడించారు. బాలకృష్ణతో తీసిన చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహ చిత్రాలు అభిమానులను అలరించాయని, బాలయ్య అవకాశం ఇస్తే మళ్లీ ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బెల్లంకొండ సురేష్ తెలిపారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మ గతంలో మిత్రుడు అనే టైటిల్‌ను కళ్యాణ్‌రామ్ సినిమాకోసం రిజిస్టర్ చేశారని చెప్పారు. అయితే ఆ టైటిల్ తన చిత్ర కథకు సరిపోతుందని భావించి, కళ్యాణ్ రామ్ ద్వారా ఆ టైటిల్ తీసుకున్నానని తెలిపారు. బెల్లంకొండ సురేష్ ఫంక్షన్‌కు రావడం తన మాతృసంస్థ కార్యక్రమానికి వచ్చినంత ఆనందంగా ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు హేమచంద్ర మిత్రుడు సినిమాలో గోపాలబాల అనే పాటను పాడారని, అతనికి మంచి భవిష్యత్ ఉందని బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోలు తనీష్, నాని, హీరోయిన్లు శ్వేతబసుప్రసాద్, రక్ష మాట్లాడుతూ తమకు ఈ చిత్రం గుర్తింపు సంపాదించి పెడుతుందని ఆకాంక్షించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
ఏడుకొండలవాడా వెంకటరమణ లోగో ఆవిష్కరణ
28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
మే 19న మల్లన్న ఆడియో విడుదల
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
ప్రభాస్, అనుష్క జంటగా ఇటీవల విడుదలైన బిల్లా చిత్రం విజయవంతంగా ప్రదర్శించ...
28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...