|
| విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో |
| శుక్రవారం, 15 మే 2009 ( 12:38 IST ) | |
వేణు, కమలిని ముఖర్జీ జంటగా వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం గోపి గోపిక గోదావరి. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో మహర్షి సినిమా పతాకంపై వల్లూరి రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
అదేసమయంలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంల ఇటీవల రాజమండ్రిలోని గోదావరి తీరాన పుష్కరాల రేవు వద్ద లాంచీలో ప్రత్యేకంగా వేసిన మొబైల్ హాస్పిటల్ సెట్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమానులు, చలన చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆడియో క్యాసెట్‌ను జెమిని ఫిలిం సర్క్యూట్ అధినేత రవిశంకర్ ప్రసాద్ ఆవిష్కరించి, దర్శకుడు వంశీకి అందజేయగా, సీడీని హీరోహీరోయిన్లు వేణు, కమలినీ ముఖర్జీలు ఆవిష్కరించి, సంగీత దర్శకుడు చక్రికి అందజేశారు. దీంతోపాటు వినూత్న రీతిలో 93.5 ఎఫ్.ఎం. రేడియో నిర్వహించిన గోపి గోపిక జంటల కాంటెస్ట్‌లో ఎంపికైన ఐదు జంటలకు చిత్ర హీరోహీరోయిన్ల చేతుల మీదుగా ఆడియో సీడీలను అందజేశారు.
ఈ సందర్భంగా హీరో వేణు మాట్లాడుతూ ఆడియోతో పాటు సినిమాను కూడా ప్రేక్షకులు విజయవంతం చేస్తే, శతదినోత్సవాన్ని కూడా ఇలాగే అభిమానుల సమక్షంలో జరుపుకుంటామని చెప్పారు. ఈ సినిమాలో నటించడం ద్వారా గోదావరి ప్రాంతంలో తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందని వేణు అన్నారు.
వంశీ దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని కమలిని ముఖర్జీ చెప్పారు. ఈ సినిమాను వంశీ అందమైన దృశ్యకావ్యంగా మలిచారని ఆమె ప్రసంశించారు.
సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ వంశీ కాంబినేషన్‌లో గతంలో తాను చేసిన "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" సినిమా కంటే ఈ చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత వల్లూరి పల్లి రమేష్ మాట్లాడుతూ వంశీ మొదటి సినిమా మంచుపల్లకితో తాను ప్రొడక్షన్ మేనేజర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. వంశీతో "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" చిత్రాన్ని నిర్మించి విజయం సాధించానన్నారు. మళ్లీ గోపి గోపిక గోదావరి అంతటి సక్సెస్ అవుతుందని నిర్మాత ఆశించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|