యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
గురువారం, 14 మే 2009   ( 17:29 IST )
Adhe nuvvu adhe nenu
PC
శశాంక్, చక్‌దే ఇండియా ఫేం ఆర్యమీనన్ జంటగా మోషక్ మూవీ మేకర్స్ పతాకంపై జాన్ బాప్టిస్ట్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం అదే నువ్వు - అదే నేను. ఈ చిత్రానికి శ్రీనివాస్ బల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని డీటీఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ నిర్మాత జాన్ బాప్టిస్ట్ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారని అన్నారు. ఈ చిత్రంలోని మూడు పాటలను మలేషియాలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించినట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ షూటింగ్ వేళ చక్కగా సహకరించినట్టు ఆయన పేర్కొన్నారు.

వేల్ రికార్డ్స్ ద్వారా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రం ద్వారా శశాంక్‌కు మంచి పేరు వస్తుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గాయత్రి, సరహ, రంగనాథ్, సత్యం రాజేష్, ఏవీఎస్, దువ్వాసి, మెల్కోటి, రాజాశ్రీధర్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్- మణి సుచిత్ర, ఫైట్స్- రామ్, లక్ష్మణ్, కెమెరా- రషీద్ మొపెన్, సంగీతం- మోహన్ సితార, నిర్మాత- జాన్ బాప్టిస్ట్, దర్శకత్వం- శ్రీనివాస్ బల్లా.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఏడుకొండలవాడా వెంకటరమణ లోగో ఆవిష్కరణ
28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
మే 19న మల్లన్న ఆడియో విడుదల
లారెన్స్ హీరోగా రాజాధిరాజా ఆడియో విడుదల
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
ప్రభాస్, అనుష్క జంటగా ఇటీవల విడుదలైన బిల్లా చిత్రం విజయవంతంగా ప్రదర్శించ...
28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...