|
| ఏడుకొండలవాడా వెంకటరమణ లోగో ఆవిష్కరణ |
| బుధవారం, 13 మే 2009 ( 16:03 IST ) | |
శ్రీకాశినాయన కళామందిర్ పతాకంపై సూర్య దర్శకత్వంలో గుండ్లకుంట శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ఏడుకొండలవాడా వెంకటరమణ. ఈ చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎంఎల్ఏ బి. పార్థసారథి, అభిషేక్, మోహన్, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న కొన్ని సమస్యల గురించి చూపిస్తూ వాటికి పరిష్కారాన్ని సైతం చెప్పే ప్రయత్నం చేశామన్నారు. రచయిత సుదర్శన్ మాట్లాడుతూ తాను ఈ చిత్ర కథను ఆరేళ్ల క్రితమే సిద్ధం చేసుకున్నానని, ఓసారి తిరుపతికి వెళ్తుంటే ఈ చిత్ర నిర్మాత కన్పించారని అప్పుడు ఆయనకు కథ గురించి చెప్పడం జరిగిందన్నారు.
కథ గురించి చెప్పగానే టైటిల్ గురించి అడిగిన ఆయన ఏడుకొండలవాడా వెంకటరమణ అనే టైటిల్ వినడంతోటే మొదట టైటిల్ రిజిష్టర్ చేయించి తర్వాత కథ విని అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. తాము చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి మంచి ఫలితం వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
సంగీత దర్శకుడు ఘంటాటి కృష్ణ మాట్లాడుతూ తన గత చిత్రాల తరహాలో కాకుండా ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందని పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|