యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.
బుధవారం, 13 మే 2009   ( 16:02 IST )
Aa_Aaa_ee_Eee
PC
శ్రీకాంత్, సదా, మీరాజాస్మిన్‌లు జంటగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అ..ఆ.ఇ..ఈ. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకులముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత అశోక్‌యాదవ్ తెలిపారు.

ఈ చిత్ర విశేషాల గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖర్ మాట్లాడుతూ శ్రీకాంత్ క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. పెళ్లి అయిన శ్రీకాంత్‌కు అనుకోని పరిస్థితుల్లో మరో స్త్రీతో ఏర్పడిన పరిచయం చివరకు ఎటువంటి పరిణామాలుక దారితీసింది అన్న పాయింట్‌తో ఈ చిత్రం సాగుతుందన్నారు. శ్రీకాంత్ గత చిత్రాల తరహాలోనే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ తరహాలో సాగుతుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలోనే తొలికాపీ సిద్ధం చేసి 28న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మాస్ తరహా పాత్ర చేస్తున్నానని, పూర్తి సెంటిమెంట్, ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందన్నారు. అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం లభించిన తాను యమగోల మళ్లీ మొదలైంది చిత్రం తర్వాత శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో చేస్తున్న చిత్రమిదని అన్నారు. ఈ చిత్రానికి శ్రీలేఖ చక్కని బాణీలు సమకూర్చిందని, ఆడియో ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందిందని చిత్రం సైతం తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
మే 19న మల్లన్న ఆడియో విడుదల
లారెన్స్ హీరోగా రాజాధిరాజా ఆడియో విడుదల
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
బ్రహ్మాజీ హీరోగా రత్నం దర్శకత్వంలో చిత్రం
వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు ప్రయాణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
విశిష్ట్ ఆర్ట్స్ పతాకం రూపుదిద్దుకుంటోన్న శ్రీ బాలాజీ త్రీ డీ యానిమేషన్ చిత్రం ఆడియోను...
సుశీలచే రెహ్మాన్‌కు స్వర్ణకిరీటంతో సన్మానం
నానీ, మాధవీలతల కొత్త చిత్రం 'స్నేహితుడా'
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...