యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్
బుధవారం, 13 మే 2009   ( 16:01 IST )
Billla
PC
ప్రభాస్, అనుష్క జంటగా ఇటీవల విడుదలైన బిల్లా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. లహరి మ్యూజిక్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తాజ్ కృష్ణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విచ్చేశారు.

ఈ సందర్భంగా బిల్లా గురించి ఆయన మాట్లాడుతూ తమిళ బిల్లాలోని లోటుపాట్లను చక్కదిద్ది మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని అన్నారు. తమిళ బిల్లాలో క్లైమాక్స్ కొంత వీక్‌గా ఉందని, తెలుగులో మాత్రం దాన్ని చక్క దిద్దారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తెలుగులో సక్సెస్ చిత్రాల సంఖ్య తగ్గిందని చెబుతున్న సమయంలో బిల్లా తన సత్తా నిరూపించుకుందని ఆయన పేర్కొన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ తమ బేనర్‌లో వచ్చిన ఈ చిత్రం చక్కని విజయాన్ని సాధించిందని అన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడి పనిచేశారని, చిత్రం మహిళా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోందని ఆయన తెలిపారు.

హీరో ప్రభాస్ మాట్లాడుతూ అభిమానులు చిత్రాన్ని విజయవంతం చేశారని అందరికీ కృతజ్ఞతలని అన్నారు. నాలుగున్నర నెలల్లో పెద్ద చిత్రాన్ని పూర్తిచేసి రిలీజ్ చేయడం మాటలు కాదని, సమిష్టి కృషివల్లేఇది సాధ్యమైందని అన్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ ఈ చిత్ర విజయంలో ఫస్ట్ క్రెడిట్ హీరో ప్రభాస్‌దేనన్నారు. తన పెదనాన్నతో కలిసి గోపీకృష్ణా బేనర్‌లో చేయాలనుకునే ప్రభాస్ కల తన దర్శకత్వంలో నెరవేరడం తనకు సంతోషంగా ఉందని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మే 19న మల్లన్న ఆడియో విడుదల
లారెన్స్ హీరోగా రాజాధిరాజా ఆడియో విడుదల
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
బ్రహ్మాజీ హీరోగా రత్నం దర్శకత్వంలో చిత్రం
వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు ప్రయాణం
విదేశాల్లో షూటింగ్ కోసం ఆంజనేయులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల
విశిష్ట్ ఆర్ట్స్ పతాకం రూపుదిద్దుకుంటోన్న శ్రీ బాలాజీ త్రీ డీ యానిమేషన్ చిత్రం ఆడియోను...
సుశీలచే రెహ్మాన్‌కు స్వర్ణకిరీటంతో సన్మానం
నానీ, మాధవీలతల కొత్త చిత్రం 'స్నేహితుడా'
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...