|
| మే 19న మల్లన్న ఆడియో విడుదల |
| బుధవారం, 13 మే 2009 ( 14:07 IST ) | |
విక్రమ్ హీరోగా శ్రేయ హీరోయిన్‌గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం మల్లన్న. వి.క్రియేషన్స్ పతాకంపై కళైపులి ఎస్. థాను సమర్పణలో సుశీ గణేషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 19న విడుదల కానుంది. అలాగే వచ్చే నెల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మల్లన్న చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్స్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ దేశంలో పేదవారు మరీ పేదవారుగా, ధనవంతులు మరింత ధనవంతలుగా మారుతున్నారని దీనికి పరిష్కారం ఏమిటన్నది ఈ చిత్రంలో చూపినట్టు తెలిపారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన నేపథ్యంలో తమిళనాడులో మాదిరిగానే తెలుగులో కూడా మల్లన్న ఫౌండేషన్ పేరుమీదుగా రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ ఇది చక్కని సందేశంతో కూడిన చిత్రమన్నారు. ఈ చిత్రంలో తాను వివిధ గెటప్పుల్లో కనిపిస్తానని ఈ చిత్ర నిర్మాణానికి ఏడాదిన్నర కాలం పట్టిందని అన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారని, తాను సైతం ఈ చిత్రంలో పాటలు పాడానని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|