|
| లారెన్స్ హీరోగా రాజాధిరాజా ఆడియో విడుదల |
| మంగళవారం, 12 మే 2009 ( 15:56 IST ) | |
శ్రీదేవీ పిక్చర్స్ పతాకంపై డా.వి.నాగేశ్వర రెడ్డి సమర్పణలో లారెన్స్ హీరోగా నటిస్తోన్న చిత్రం రాజాధిరాజా. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మే 8న చెన్నైలోని ఆంధ్రా సోషల్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్రా క్లబ్)లో ఘనంగా జరిగింది. ఆడియో సీడీని లారెన్స్ ఆవిష్కరించి తొలి ప్రతిని ముంతాజ్‌కి, రెండో సీడీని శక్తి చిదంబరానికి అందజేశారు.
ఆడియో విడుదల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ లారెన్స్ వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించారని కొనియాడారు. ఈ చిత్రంతో పాటు ఆడియోకు కూడా తప్పకుండా హిట్ అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ముంతాజ్ విలన్ పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఆయన వెల్లడించారు.
ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించే కామ్న జెఠ్మలాని, స్నిగ్ధ, మీనాక్షి, నీలిమ చక్కగా నటించారని దర్శకుడు శక్తి చిదంబరం అన్నారు. ముంతాజ్ తనతో పోటీపడి నటించిందని, దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని హీరో లారెన్స్ తెలిపారు.
సెక్సీతార ముంతాజ్ మాట్లాడుతూ ఈ సినిమాలోని తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ప్రేక్షకులందరూ తనను ఒక డ్యాన్సర్‌గా, నటిగా చూశారని, ఈ సినిమాలో దానికి భిన్నంగా విలన్‌గా నటించానని ముంతాజ్ చెప్పారు. ఇలాంటి పాత్ర కోసం చాలా రోజులు ఎదురు చూశానని ఆమె తెలిపారు.
ఈ చిత్రానికి పాటలు- భువన చంద్ర వెన్నెల కంటి, సంగీతం- కరుణాస్, ఫైట్స్- కణ్ణల్ కన్నన్, మాటలు- శశాంక్ వెన్నెల కంటి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|