|
| శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదల | |
విశిష్ట్ ఆర్ట్స్ పతాకం రూపుదిద్దుకుంటోన్న శ్రీ బాలాజీ త్రీ డీ యానిమేషన్ చిత్రం ఆడియోను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన లక్ష గళ సంకీర్తనార్చన వేదికపై లాంఛనంగా విడుదల చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర మహిమలను ఆధారంగా తీసుకుని శ్రీ బాలాజీ త్రీడీ యానిమేషన్ చిత్రం రూపొందుతుండడం విశేషం.
అన్నమాచార్యుని 601 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో టీటీడీ లక్ష గళ సంకీర్తనార్చన కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. గిన్నిస్ రికార్డు సాధించిన ఈ కార్యక్రమం జరిగిన వేదికనుంచే శ్రీ బాలాజీ అడియో సైతం విడుదల కావడం గమనార్హం. చేశారు.
శ్రీనివాస కళ్యాణం కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న శ్రీ బాలాజీ చిత్రానికి శ్రీ అక్కినేని వినయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు గంటల పది నిమిషాల నిడివిగల ఈ యానిమేషన్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ త్రీడీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించడానికి 250 మంది సాంకేతిక నిపుణులు గత మాసాలుగా ఆరు నెలలుగా శ్రమిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|