యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
బ్రహ్మాజీ హీరోగా రత్నం దర్శకత్వంలో చిత్రం
మంగళవారం, 12 మే 2009   ( 15:51 IST )
Brahmaji new film
PC
బ్రహ్మాజీ, రేఖాశ్రీ జంటగా రత్నం కె.వి. దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం రెండో షెడ్యూల్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. శ్రీ శ్రీ కుమార స్వామి ఫిలిమ్స్ పతాకంపై ఎస్. బసవపున్నయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఏప్రిల్ నెలలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో ఒక పాటను, ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించినట్లు నిర్మాత చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు రత్నం కె.వి. మాట్లాడుతూ కుటుంబ కథా నేపథ్యంలో, వినోదాత్మక కథనంతో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిదని తెలిపారు. ఇందులో బ్రహ్మాజీ పాత్ర బాధ్యతాయుతమైందని, గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని రత్నం తెలియజేశారు. మోహన్ బాణీలు అందించిన ఈ చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు వెల్లడించారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం- కుమార స్వామి, సంగీతం- బల్లేపల్లి మోహన్, ఆర్ట్ డైరక్టర్- గోవింద, ప్రొడక్షన్ మేనేజర్- వెంకట్, నిర్మాత- ఎస్.బసవపున్నయ్య, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం- రత్నం కె.వి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు ప్రయాణం
విదేశాల్లో షూటింగ్ కోసం ఆంజనేయులు
నానీ, మాధవీలతల కొత్త చిత్రం 'స్నేహితుడా'
సుశీలచే రెహ్మాన్‌కు స్వర్ణకిరీటంతో సన్మానం
65ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న అక్కినేని
సినిమా ప్రమోషన్‌లోకి ఆర్.కె. మీడియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సుశీలచే రెహ్మాన్‌కు స్వర్ణకిరీటంతో సన్మానం
సంగీతమాంత్రికుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్‌కు స్వర్ణ కిరీట...
నానీ, మాధవీలతల కొత్త చిత్రం 'స్నేహితుడా'
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...