|
| వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు ప్రయాణం |
| సోమవారం, 11 మే 2009 ( 16:38 IST ) | |
మంచు మనోజ్‌కుమార్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రం పాటలు సోమవారం మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. రేడియో మిర్చి ద్వారా ఈ చిత్రం పాటలను హీరో మనోజ్‌కుమార్ స్వయంగా విడుదల చేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని రేడియో మిర్చి కార్యాలయానికి చేరుకున్న మనోజ్ శ్రోతలతో మాట్లాడుతూ పాటలను ప్రయాణం చిత్రం పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ తెలుగులో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని వేసవి సెలవుల కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
చిత్ర విశేషాల గురించి హీరో మనోజ్ చెబుతూ తాను నటించిన నేను మీకు తెలుసా! పాటలను సైతం ఇలాగే రేడియో మిర్చిద్వారా విడుదలై శ్రోతల మన్ననలు చూరగొన్నాయని అన్నారు. ప్రయాణం పాటలు కూడా ఇదే తరహాలో హిట్ అవుతాయని మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాగ.కామ్, ప్రయాణం.కామ్‌లలో ఈ పాటలను వినవచ్చునని, అవసరమైతే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చునని ఆయన వివరించారు.
మహేష్ శంకర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని మనోజ్ అన్నారు. 2 గంటలపాటు ఎయిర్‌పోర్ట్‌లో సాగే ఈ కథని దర్శకుడు ఏలేటి అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు.
సంగీత దర్శకుడు మహేష్ శంకర్ మాట్లాడుతూ చిత్రకథంతా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. యునీక్ కాన్సెప్ట్, రీరికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు. హైపర్‌యాక్టివ్‌గా ఉండే వ్యక్తి, అమ్మాయి ప్రేమకోసం సాఫ్ట్‌గా తయారుకావడం మళ్లీ తన యాక్టివ్‌నెస్‌లోకి వెళ్లిపోయే పాత్రలో మనోజ్‌కుమార్ అద్భుతంగా చేశారని శంకర్ అన్నారు. ఇంకా ఈ సినిమాకు బ్రహ్మానందం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మహేష్ శంకర్ తెలిపారు.
హారిక హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి పాటలు- అనంత్ శ్రీరామ్, కెమేరా- సర్వేష్ మురారి, నిర్మాత, దర్శకత్వం- చంద్రశేఖర్ ఏలేటి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|