|
| విదేశాల్లో షూటింగ్ కోసం ఆంజనేయులు |
| సోమవారం, 11 మే 2009 ( 11:37 IST ) | |
రవితేజ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్‌బాబు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ఆంజనేయులు. యువత ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ఏకధాటిగా సాగుతోంది.
ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్ 22 నుంచి హైదరాబాద్‌లో ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నామన్నారు. దాదాపు 75లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన కార్పొరేట్ ఆఫీస్ సెట్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ఈ నెల (మే) 16వరకు హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరిస్తామని ఆయన అన్నారు. దీని తర్వాత మే 18 నుంచి 26వరకు ఆమ్‌స్టర్ డామ్, జర్మనీ, ఆస్ట్రియాల్లో, రవితేజ, నయనతారలపై రెండు పాటల్ని చిత్రీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 20వరకు సాగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందన్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. రవితేజలో ఉన్న ఎనర్జిటిక్, సిన్సియారిటీ, బిహేవియర్ వంటి కారణాలను చూస్తే అవే ఆయనను ఉన్నత స్థితికి ఎదగడానికి కారణాలని నిర్మాత కొనియాడారు. రవితేజ కెరీర్‌లోనే ఆంజనేయులు సూపర్ హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|