యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సుశీలచే రెహ్మాన్‌కు స్వర్ణకిరీటంతో సన్మానం
సోమవారం, 11 మే 2009   ( 11:34 IST )
Rehman
PC
సంగీతమాంత్రికుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్‌కు స్వర్ణ కిరీట ధారణ చేయడం ద్వారా ప్రముఖ నేపథ్య గాయని సుశీల ఆత్మీయ సన్మానం జరిపారు. హైదరాబాద్‌లోని మారియేట్ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సుశీల రెహమాన్‌కు ఈ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన రెహమాన్‌ను సన్మానించే అవకాశం తమకు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రెహమాన్‌కు స్వర్ణకిరీట ధారణ చేసిన సుశీల అదేసమయంలో రెహమాన్ తల్లికి స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ ప్లస్ ఒన్ చదువుకునే రోజుల్లోనే రమేష్ నాయుడు స్కూల్లో రెండు సంవత్సరాలు పనిచేశానని తెలిపారు.

అనంతరం తాను ఇళయరాజా, రాజ్‌కోటి వద్ద ఆరేళ్లు పనిచేశానని రెహమాన్ చెప్పుకొచ్చారు. తనకు నచ్చిన గాయని సుశీల అని, ఈ సన్మాన కార్యక్రమం ఆమె చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందన్నారు. తాను సంగీతంలో ఓనమాలు దిద్దుకుంది తెలుగులోనేనని రెహమాన్ గుర్తు చేసుకున్నారు.

ఈ వేడుకలో భాగంగా రఘురాజ్, గురవారెడ్డి తదితరులు రెహమాన్‌‍కు "స్వరాల సామ్రాట్" (సుర్ షెహెనషా) బిరుదును ప్రదానం చేశారు. పి. సుశీల మాట్లాడుతూ వందేమాతరం అనే దేశభక్తి గేయానికి గొప్ప అర్థానిచ్చిన రెహమాన్ అప్పట్లో ఒక శకమైతే, "జయహో" అంటూ మరో శకానికి శ్రోతలను తీసుకెళ్ళారని ప్రశంసల వర్షం కురిపించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
65ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న అక్కినేని
సినిమా ప్రమోషన్‌లోకి ఆర్.కె. మీడియా
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
తిరుమల శ్రీవారిపై త్రీడీ యానిమేషన్ చిత్రం
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన సంగీత...
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...