యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
65ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న అక్కినేని
శనివారం, 9 మే 2009   ( 15:50 IST )
Akkineni
PC
తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటనా జీవితంలో 65ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అక్కినేని సినీ పరిశ్రమలోకి ప్రవేశించి శుక్రవారంనాటికి 65 ఏళ్లు పూర్తయ్యింది.

కృష్ణా జిల్లాలోని గుడివాడ వద్ద ఉన్న వెంకట రాఘవపురంలో 1924 సెప్టెంబర్ 20న జన్మించిన అక్కినేని చిన్నతనం నుంచే నాటకరంగంవైపు దృష్టి సారించారు. అలా మెల్లగా సినీ పరిశ్రమవైపు అడుగులు మొదలు పెట్టిన అక్కినేని 1940లో విడుదలైన ధర్మపత్ని చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.

అటుపై హీరోగా ఓ వెలుగు వెలిగిన అక్కినేని లైలా మజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్ వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. ఈ విధంగా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి 65ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు అక్కినేనిని ఆయన స్వగృహంలో కలుసుకుని అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ తనకు గ్లామర్, డబ్బులేకపోయినా నటునిగా ఎంతోమంది అభిమానులు తన సినిమాలు చూసి ప్రోత్సహించారని అన్నారు. అప్పట్లో హీరోలను ప్రమోట్ చేసే సంస్థలు సైతం లేవని, అయితే తన అభిమానులంతా కల్చర్ పీపుల్ అని నాగేశ్వరరావు పేర్కొన్నారు.

అలాగే తాను నటించిన సినీ విశేషాలను గురించి అక్కినేని మాట్లాడుతూ 8.5.1994న సీతారామజననం సినిమాలో ఓ డైలాగ్ చెప్పాల్సివచ్చిందని, తనది ఫీలగొంతు కావడంతో తాను ఎలా చెబుతానోనని అసిస్టెంట్ డైరక్టర్లంతా ఆతృతంగా ఎదురుచూస్తున్న సమయంలో "సత్యకీర్తి హరివంశం మనవాడు కాదా" అనే డైలాగ్‌ను తాను మామూలుగా చెప్పేశానని నాగేశ్వర రావు గుర్తు చేసుకున్నారు.

అలా తాను చెప్పిన డైలాగ్ చాలా పీలగా రావడంతో తాను ఆడవేషాలకు మాత్రమే సరిపోతానని డైరక్టర్లు అంచనాకు వచ్చేశారని అటుపై తనకు ఆడవేషాలే ఎక్కువగా వచ్చేవని నాగేశ్వరరావు తెలిపారు. తనకు అక్కాచెల్లెల్లు లేకపోవడంవల్ల తన తల్లి తనకు ఆడపిల్లలకు వేయాల్సిన గౌనులు, జడలు అల్లేదని బహుశా ఆ ప్రభావం తనపై పడిదేమోనని అక్కినేని అభిప్రాయపడ్డారు.

అయితే సినిమా రంగంలోకి వచ్చాక తాను వెనక్కి తిరిగి చూసుకునే ఆలోచనే రాలేదని, ఒకవేళ ఈ రంగానికి రాకపోతే ఎందుకు రాలేకపోయానా అని బాధపడేవాడినంటూ అక్కినేని తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. అదేసమయంలో అక్కినేని నటునిగా 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని ఎడ్యుకేషన్ ట్రస్టు ఓ బ్రోచర్‌ను విడుదల చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సినిమా ప్రమోషన్‌లోకి ఆర్.కె. మీడియా
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
తిరుమల శ్రీవారిపై త్రీడీ యానిమేషన్ చిత్రం
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభం
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన సంగీత...
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...