|
| రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల |
| శుక్రవారం, 8 మే 2009 ( 17:22 IST ) | |
స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం చేయనున్నట్టు ప్రముఖ నేపథ్య గాయని పి. సుశీల తెలిపారు. హైదరాబాద్‌లోని మారియెట్ హోటల్‌లో శనివారం నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా రెహ్మాన్‌ను సత్కరించనున్నట్టు ఆమె వివరించారు.
ఈ విషయమై శుక్రవారం విలేకరుల సమావేశంలో సుశీల మాట్లాడుతూ రెహ్మాన్‌ను సత్కరించాలనుకోవడం తన మనసులోని కోరికగా పేర్కొన్నారు. భారతీయుడిగా అవార్డు గెల్చుకున్న రెహ్మాన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పినరోజే సన్మానం గురించి కూడా చెప్పానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సత్కారానికి తప్పకుండా వస్తానని అన్నారని ఆమె చెప్పారు.
తాను రెహ్మాన్ సంగీతంలో పాడలేదని అయితే తన కోడలు మాత్రం ఆయన సంగీతంలో పాడిందని దానికి కృతజ్ఞతగానే ఈ సన్మానం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న తిరుమల మ్యూజిక్ కంపెనీ (టీఎంసీ), మాటీవీ, మేరియెట్ హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|