|
| ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి |
| బుధవారం, 6 మే 2009 ( 12:41 IST ) | |
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగనున్న హెబిటాట్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికయ్యింది. రాజేంద్రప్రసాద్ నటించిన ఈ చిత్రాన్ని సి.సి. రెడ్డి సమర్పించారు. సోనియా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి, ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా సి.సి. రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడో తీసిన ఈ చిత్రానికి ఇప్పుడు గౌరవం దక్కడం గర్వంగా ఉందన్నారు. తెలుగు చిత్రాల గొప్పతనం ఈ చిత్రం ద్వారా మరోసారి రుజువైందని అన్నారు.
దర్శకుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విడుదలైన ఏడాదిన్నర తర్వాత కూడా ఈ చిత్రానికి గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి సినిమాలకు ఆదరణ లభిస్తేనే మరిన్ని చిత్రాలు వస్తాయని, ఇటువంటి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|