|
| కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు |
| బుధవారం, 6 మే 2009 ( 12:39 IST ) | |
బాలకృష్ణ, ప్రియమణి జంటగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న మిత్రుడు చిత్రం కొత్త పాటతో సరికొత్తగా ముస్తాబైంది. హీరో బాలకృష్ణ, హీరోయిన్ ప్రియమణిలపై చిత్రీకరించిన మరోపాటను జతచేయడం ద్వారా మిత్రుడు చిత్రాన్ని సరికొత్తగా ప్రేక్షకులకు అందించనున్నట్టు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ విషయమై మంగళవారం మహతీ రికార్డింగ్ థియేటర్‌లో నిర్మాత మాట్లాడుతూ ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి అదనంగా మరో 14 ప్రింట్లను పెంచబోతున్నామని, ఈ సందర్భంగానే కొత్తపాటను జోడించనున్నామని తెలిపారు.
అలాగే ఆయన మాట్లాడుతూ ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్ చిత్రాలు బాలకృష్ణ చేస్తున్న సమయంలోనే తాను ఆదిత్య 369 అనే చిత్రాన్ని నిర్మించానని, అది అప్పట్లోనే వందరోజులు ఆడిందని నిర్మాత గుర్తు చేశారు. ప్రస్తుతం మిత్రుడు కూడా మంచి ఆదరణ పొందుతుందని ఆశించారు. బాలకృష్ణ, ప్రియమణిపై చిత్రించే ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చినట్టు శివలెంక ప్రసాద్ అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|