యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
5 మే 2009   ( 11:42 IST )
Arthi new film
PC
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆర్తీ అగర్వాల్ కథానాయికగా, ఆల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వి.వి.ప్రసాద్ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. సి. హెచ్. సుధాకర్ బాబు నిర్మించనున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ బాబు మాట్లాడుతూ తెలుగులో రీ-ఎంట్రీ అవుతున్న ఆర్తీ అగర్వాల్ నటించే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రమిదని తెలిపారు. ఇందులో నటించడం కోసం ఆర్తీ అగర్వాల్ చాల్ స్లిమ్‌గా తయారయ్యిదని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించి చెన్నై, హైదరాబాద్‌లలో జరిగే సింగిల్ షెడ్యూల్‌తో పూర్తి చేయునున్నట్టు ఆయన తెలిపారు.

ఆర్తీ అగర్వాల్ మాట్లాడుతూ తన రీ ఎంట్రీ గురించి తెలియగానే నాలుగైదు అవకాశాలు వచ్చినప్పటికీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పారు. తన గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా ఉంటుందని ఆర్తీ వెల్లడించారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత- టి. మోహన్‌రెడ్డి (యుఎస్ఎ), నిర్మాత- సి.హెచ్. సుధాకర్ బాబు, కథ, ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- వి.వి. ప్రసాద్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సత్యప్రకాష్ హీరోగా ముక్కోణ ప్రేమకథా చిత్రం
మహానటి సావిత్రి పేరుతో ఏటా అవార్డు: దాసరి
దాసరిచే సావిత్రి జీవిత కథ పుస్తకం విడుదల
భవిష్యత్‌లో సంచలనాత్మక చిత్రం: దాసరి
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
లారెన్స్ హీరోగా రానున్న రాజాధిరాజా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీ ఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...