యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
మహానటి సావిత్రి పేరుతో ఏటా అవార్డు: దాసరి
మంగళవారం, 5 మే 2009   ( 11:39 IST )
Dasari-balakrishna
PC
అలనాటి సినీతార మహానటి సావిత్రి పేరిట స్మారక అవార్డును ఏర్పాటు చేసి ప్రతి ఏటా అందివ్వనున్నట్లు దర్శకరత్న డా. దాసరి నారాయణరావు సోమవారం ప్రకటించారు. తన 63వ పుట్టినరోజును పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాసరి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వి.ఆర్.మూర్తి, సోమరాజులు రచించిన "ఎ లెజండ్రీ ఆర్టిస్ట్ మహానటి సావిత్రి" పుస్తకాన్ని ఆవిష్కరించిన దాసరి దాన్ని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరికి అందజేశారు.

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ సావిత్రిచే తమ్ముడు అని పిలిపించుకునే భాగ్యం తనకు కలిగిందన్నారు. సావిత్రి దర్శకత్వంలో "చిన్నారి పాపలు" చిత్రానికి తాను ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా పనిచేశానని దాసరి తెలిపారు. తెరమీద అద్భుతంగా నటించిన సావిత్రికి జీవితంలో నటించడం మాత్రం తెలియదని దాసరి పేర్కొన్నారు.

అయితే జీవితంలో సావిత్రి నటించి ఉంటే, కోటీశ్వరురాలు అయ్యేదని, ఆమె జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీషులో ఈ పుస్తకాన్ని రచించారని దాసరి వివరించారు. తెలుగు సినీ పరిశ్రమలో సినీతారగా ఓ వెలుగు వెలిగిన సావిత్రి ఎప్పటికీ మహానటీమణి అని దాసరి ప్రసంశించారు.

ఇదిలా ఉండగా దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాసరి జన్మదిన వేడుకల్లో రామానాయుడు, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దాసరిచే సావిత్రి జీవిత కథ పుస్తకం విడుదల
భవిష్యత్‌లో సంచలనాత్మక చిత్రం: దాసరి
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
లారెన్స్ హీరోగా రానున్న రాజాధిరాజా
మే రెండో వారంలో క్షణం ఒక యుగం
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
భవిష్యత్‌లో సంచలనాత్మక చిత్రం: దాసరి
దర్శకరత్నగా పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావు సోమవారం 63వ సంవత్సరంలో...
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...