|
| 24న ప్రేక్షకుల మధ్యకు సర్కస్ సర్కస్ |
| మంగళవారం, 21 ఏప్రిల్ 2009 ( 16:45 IST ) | |
సగిటేరియస్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన చిత్రం సర్కస్ సర్కస్. చిట్టిబాబు, లహరి తల్లిదండ్రులుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీధర్, చాందిని, అజయ్, ఉషశ్రీ, మానిష్ బాలనటులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన సురేష్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు ఉమేష్ కుమార్ వెల్లడించారు.
ఈ సినిమా పాటలను ఇటీవలే రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ తెలుగులో బాలలపై మంచి చిత్రాన్ని తీయాలనే సంకల్పంతో తాను సర్కస్ సర్కస్ అనే చిత్రాన్ని రూపొందించానన్నారు.
ఈ చిత్రంలోని బాలనటీనటులు చేసే కృత్యాలు పెద్దలను అలరిస్తాయని, పిల్లలకు 50శాతం తగ్గింపు ధరతో ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. సర్కస్‌లో జరిగే విశేషాలతో పాటు అందులో సస్పెన్స్ గొలిపే కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని ఆయన వివరించారు.
ఇంకా ఈ చిత్రానికి కెమేరా- శరత్, సంగీతం- శ్యామ్, దాస్, ఎడిటర్- మంజు, మాటలు- మనోజ్ బన్సాల్, ఉమేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- ఎస్. ఉమేష్‌కుమార్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|