|
| సందేశాత్మక చిత్రంగా ఆనందతాండవం |
| బుధవారం, 15 ఏప్రిల్ 2009 ( 16:21 IST ) | |
హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) జంటగా రూపొందిన చిత్రం ఆనందతాండవం. చెన్నైలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఈ చిత్ర విశేషాల గురించి తెలుగులో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన ఎస్.వి.ఆర్. సంస్థ అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ సుజాత రాసిన ధారావాహిక ఆధారంగా ఆస్కార్ ఫిలింస్ ఆనందతాండవం పేరిట తమిళంలో నిర్మించిందని దాన్ని తెలుగులో తాము నిర్మించామని తెలిపారు.
ఆస్కార్ పతాకంపై గతంలో వచ్చిన అపరిచితుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ తరహాలోనే ఆనందతాండవం సైతం చక్కని సందేశంతో ఉందని శోభారాణి తెలిపారు. ఈ నెల పదోతేదీన విడుదలైన ఆనందతాండవం చిత్రానికి అనూహ్య ప్రేక్షకుల ఆదరణను చూరగొందని శోభారాణి పేర్కొన్నారు.
ఆనందతాండవం చిత్రం విజయవంతమైన సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ ప్రేమను గురించి పిల్లలకు చెప్పే విధంగానూ, విదేశీ వ్యామోహంతో యువతను పాడుచేయవద్దనే చక్కని సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పడం జరిగిందన్నారు. ఈ చిత్రం కథపరంగా గమనం కాస్త నెమ్మదిగా ఉన్న మాట నిజమేనని, కానీ అది కథకు తప్పదని ఆమె అన్నారు.
గీతరచయిత వనమాలి మాట్లాడుతూ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం వినసొంపుగా ఉందని, తాను రెండు పాటలను రాశానని చెప్పారు. ప్రేమతోపాటు జీవిత లక్ష్యాన్ని గెలవాలనే విధంగా యువతకు చక్కని సందేశాన్ని ఈ సినిమాలో చూపారని ఆయన పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|