యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
అలీ హీరోగా నచ్చావ్ అల్లుడు ఆడియో
బుధవారం, 15 ఏప్రిల్ 2009   ( 16:19 IST )
Nachav alludu
PC
అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం నచ్చావ్ అల్లుడు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉష సింగంశెట్టి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది.

ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించగా, ఆడియో క్యాసెట్‌ను మరో దర్శకుడు శరత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సభకు హాజరైన నటీనటులు మాట్లాడుతూ చిత్ర నిర్మాతలను పేమెంట్స్ మాస్టర్స్‌గా అభివర్ణించారు. నిర్మాణరంగంలో కొత్తవారైనా షూటింగ్ ముందుగానే పారితోషికాలు ఇవ్వడమనేది మెచ్చుకోదగ్గ అంశంగా వారు పేర్కొన్నారు.

బి.గోపాల్, శరత్‌లు మాట్లాడుతూ చిత్ర దర్శకుడు తమ వద్ద చాలాకాలం నుంచి పనిచేశాడని, ఈ సినిమా ద్వారా అతనికి మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. అలీ మాట్లాడుతూ దర్శకుడు శరత్ పెద్దింటల్లుడు, దొంగల్లుడు, చిన్నల్లుడు వంటి చిత్రాలు తీస్తే ఆయన శిష్యుడు నచ్చావ్ అల్లుడు అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ చిత్రంలో తనలాంటి హాస్యనటలందరూ వైవిధ్యమైన పాత్రలను పోషించారని, ఆద్యంతం నవ్వించే చిత్రమవుతుందని అలీ చెప్పారు.

రఘుబాబు మాట్లాడుతూ ఇందులో తాను అమితాబ్ సర్కార్ పాత్రను పేరడీగా పోషించానని, ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆ సినిమా చూసి చేశానన్నారు. ఇది తన కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్ర అవుతుందని రఘుబాబు నమ్మకం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విడుదలకు సిద్ధమైన బంగారు బాబు
మే 1న ప్రేక్షకుల ముందుకు మిత్రుడు
దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు
తేజం చిత్రం కోసం ప్రీతిజింగ్యానీ పాట
చివరిదశ షూటింగ్‌లో జగన్మోహిని
అర్జున్ హీరోగా 17న రానున్న జై సాంబశివ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నమిత ప్రధాన పాత్రలో దేశద్రోహి
శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై, జి.వి.హెచ్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం దేశద్రోహి. కె. ఎస్. నాగేశ్వరరావు...
వీడొక్కడేగా ప్రేక్షకుల ముందుకు సూర్య
అర్జున్ హీరోగా 17న రానున్న జై సాంబశివ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...