యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
విడుదలకు సిద్ధమైన బంగారు బాబు
బుధవారం, 15 ఏప్రిల్ 2009   ( 16:18 IST )
Bangarubabu
PC
డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం బంగారుబాబు. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే ఒకటిన విడుదల కావడానికి సిద్ధమైంది.

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ చక్కని కుటుంబకథా చిత్రంగా రూపొందిన బంగారుబాబు చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించిందన్నారు. పాటలకు తగ్గట్లుగా పిక్చరైజేషన్ బాగా కుదిరిందని, బంగారుబాబుగా జగపతిబాబు చక్కని నటనను ప్రదర్శించారని నిర్మాత కొనియాడారు. మీరాజాస్మిన్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని, మంచి సంస్థలో మంచి చిత్రాన్ని తీయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో మురళీమోహన్, షిండే, సోనూసూద్, జయసుధ, హేమ, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, ధర్మవరపు, నారాయణరావు, వైజాగ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ- దాసరి పద్మ, మాటలు- మరుధూరి రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత- సి.ఎం. కృష్ణ.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మే 1న ప్రేక్షకుల ముందుకు మిత్రుడు
దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు
తేజం చిత్రం కోసం ప్రీతిజింగ్యానీ పాట
చివరిదశ షూటింగ్‌లో జగన్మోహిని
అర్జున్ హీరోగా 17న రానున్న జై సాంబశివ
ఎన్నికల తర్వాత ప్రేక్షకుల ముందుకు అధినేత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నమిత ప్రధాన పాత్రలో దేశద్రోహి
శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై, జి.వి.హెచ్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం దేశద్రోహి. కె. ఎస్. నాగేశ్వరరావు...
వీడొక్కడేగా ప్రేక్షకుల ముందుకు సూర్య
అర్జున్ హీరోగా 17న రానున్న జై సాంబశివ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...