|
| బికినీ గురించి ఇప్పుడు మాట్లాడను: అనుష్క |
| బుధవారం, 8 ఏప్రిల్ 2009 ( 15:30 IST ) | |
ప్రభాస్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిల్లా చిత్రంలో బికినీలో అందాలు ఆరబోసిన అందాల అరుంధతి అనుష్క ఆ కాస్ట్యూమ్ తనకు మరీ అంత ఎబ్బెట్టుగా ఏం లేదని సెలవిచ్చింది. అయితే ఆ క్యాస్టూమ్ గురించి తానిప్పుడు మాట్లాడదల్చుకోలేదని అనుష్క పేర్కొంది.
ఇటీవల హైదరాబాద్‌లో టిక్ టిక్ టిక్ అనే చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన అనుష్క విలేకరులతో ముచ్చటించింది. తాను ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడానికి ఇష్టపడనని చెప్పిన ఆమె ఆ కారణంగానే కొన్ని అవకాశాలను సైతం వదిలేసినట్టు చెప్పింది. అరుంధతి చిత్రంతో ఇటు తెలుగులోనే కాక అటు తమిళంలోనూ బాక్సాఫీసును షేక్ చేస్తున్న అనుష్క తమిళంలో ప్రస్తుతం విజయ్, సూర్యల పక్కన నటిస్తోంది.
అరుంధతి చిత్రం విజయం తర్వాత తమిళ నిర్మాతలు తన డేట్స్ కోసం ఎగబడుతున్నారని అనుష్క పేర్కొంది. అయితే అరుంధతి తరహా పాత్రలతోనే సదరు నిర్మాతలు తన ముందుకు వస్తుండడంతో ఆ అవకాశాలను తిరస్కరించినట్టు తెలిపింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|