|
| నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేత |
| మంగళవారం, 7 ఏప్రిల్ 2009 ( 16:26 IST ) | |
జగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం అధినేత. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పటాయ, పుకెట్ ఐలాండ్స్‌లలో ఇంతవరకు ఎవరూ షూట్ చెయ్యని అద్భుతమైన లొకేషన్స్‌లలో రెండు పాటల్ని చిత్రీకరించామని తెలిపారు. ఈ పాటలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జరుపుకుంటోన్న చివరి షెడ్యూల్‌తో చిత్రం షూటింగ్ పూర్తవుతుందని ఆయన వివరించారు.
దర్శకుడు మాట్లాడుతూ జగపతిబాబు కెరీర్‌లో మరో సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా అధినేత నిలుస్తుందని, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రం ఎన్నికల సీజన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతిప్రసాద్, ఆనంద్‌రాజ్, డా. పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను, పృథ్వీ, ప్రసన్న, వేణు, ఆజాద్, ఉత్తేజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు- పరుచూరి బ్రదర్స్, సంగీతం- శ్రీకాంత్ దేవా, ఫోటోగ్రఫీ- ప్రసాద్‌బాబు, ఎడిటింగ్- నందమూరి హరి, ఫైట్స్- ఢిపరెంట్ డానీ, ఆర్ట్- రమణ వంక.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|