యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
శివాజీ హీరోగా మస్త్ ఆడియో విడుదల
శుక్రవారం, 9 జనవరి 2009   ( 13:30 IST )
Masth
PC
శివాజీ హీరోగా ఆంచల్ హీరోయిన్‌గా జీటీవీ సంస్థ తెలుగులో నిర్మిస్తోన్న చిత్రం మస్త్. ఈ చిత్రం ఆడియో సరిగమ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డా.డి.రామానాయుడు విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. అలాగే ఆడియో సీడీని గ్రామ్‌ఫోన్ తరహాలో తయారుచేసి విన్నూత్నంగా సీడీని విడుదల చేశారు. ఆడియో విడుదల సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కథ, మాటలు, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఇలా అన్ని శాఖల్లో పట్టు కల్గినవారు కొద్దిమందే ఉంటారని అలాంటివారిలో కృష్ణారెడ్డి ఒకరని పేర్కొన్నారు.

ఈ చిత్రం బిర్యానీ తిన్నంత మస్త్‌గా ఉంటుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇందులోని బాయ్ ఫ్రెండ్ హలో హలో అనే పాట రింగ్‌టోన్‌గా ప్రాచుర్యం పొందే అవకాశముందని పేర్కొన్నారు. హీరోయిన్ ఆంచల్ చక్కని నటన ప్రదర్శించిందని చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు.

హీరో శివాజీ మాట్లాడుతూ పూర్తిగా కామెడీ చిత్రమని ఈ తరహా చిత్రాలను జీ టీవీ సంస్థ మరిన్నింటిని తీయాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, గీతాసింగ్, మరుధూరిరాజ, గాయని మధుమిత, జీటీవీ సౌత్ మేనేజర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అదే నువ్వు అదే నేను ఆడియో విడుదల
పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న మేస్త్రీ
కొత్తచిత్రం నిర్మాణానికి పోసాని ప్రయత్నాలు
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మస్కా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...