|
| అదే నువ్వు అదే నేను ఆడియో విడుదల |
| శుక్రవారం, 9 జనవరి 2009 ( 13:30 IST ) | |
శశాంక్ హీరోగా, ఆర్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న అదే నువ్వు అదే నేను చిత్రం ఆడియో విడుదలైంది. వేల్స్ రికార్డ్స్ ద్వారా సంగీత దర్శకుడు కీరవాణి చేతులమీదుగా ఈ ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది.
ఈ ఆడియో విడుదల సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలు విన్నానని రెండో పాట తనకు బాగా నచ్చిందని అన్నారు. టైటిల్‌లోనే ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టుగా గమ్మత్తుగా పెట్టారని అన్నారు. కేరళకు చెందిన జాన్ బాప్టిస్ట్ మరిన్ని తెలుగు చిత్రాలు తీయాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ బల్లా మాట్లాడుతూ వేల్స్ రికార్డ్స్ ఆడియోను విడుదల చేయడమే ఓ ప్రత్యేకత అని పేర్కొన్నారు. మోహన్ సితార అందించిన చక్కని సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు. తన తొలి చిత్రం సంగీతాన్ని పెద్ద సంస్థ విడుదల చేయడం తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
చక్కని ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోందని ఆయన అన్నారు. హీరో శశాంక్ మాట్లాడుతూ హీరోగా తనకిది రెండవ చిత్రమని మోహన్‌సితార ఆకట్టుకునే సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ చిత్రం తన కెరీర్‌కు తోడ్పడుతుందని ఆయన అన్నారు.
ఈ చిత్రానికి పాటలు- కలువ కృష్ణసాయి, సురేష్ గంగుల, జయసూర్య, కిరణ్‌కశ్యప్, మాటలు- జె.ఎన్.రెడ్డి, ఆర్ట్- మణిసుచిత్ర, కెమెరా- రషీద్‌మూపన్, సహనిర్మాత- రంజిత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- శ్రీనివాస్ బల్లా.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|