|
| త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్ |
| బుధవారం, 7 జనవరి 2009 ( 17:11 IST ) | |
శివబాలాజీ, ముమైత్‌ఖాన్, శ్రద్ధాదాస్ ముఖ్య పాత్రల్లో రమేష్‌రాజా దర్శకత్వంలో సిరిసాయి సూర్య మూవీస్ నిర్మించిన చిత్రం టార్గెట్. సంగిశెట్టి దశరథ, బి. రామకృష్ణ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ చిత్ర విశేషాల గురించి సంగిశెట్టి దశరథ మాట్లాడుతూ తమ చిత్రాన్ని చూసి స్పందించిన చదలవాడ శ్రీనివాసరావు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్, డిజిటల్ వర్క్‌ను చెన్నయ్‌లోని డిజిటల్ మ్యూజిక్ స్టూడియోలో చేయించినట్టు ఆయన తెలిపారు.
మర్మకళ నేపధ్యంలో సినిమా సాగుతుందని ముమైత్‌ఖాన్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో రియాజ్‌కాన్, కృష్ణభగవాన్, వేణుమాధవ్, కొండవలస, జీవా, మల్లాది రాఘవ, వైజాగ్ ప్రసాద్, గీతాసింగ్, రఘునాథరెడ్డి, విజయరంగరాజా, శరత్, రాఘవ, వల్లభనేని జనార్ధన్, గౌతంరాజు, సైరాభాను తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు- వెలిగొండ శ్రీనివాస్, సంగీతం- కోటి, కెమెరా- వి.ఎన్. సురేష్‌కుమార్, ఎడిటింగ్- కె. రమేష్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|