యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
శ్రీరామ్, పృథ్వీరాజ్ హీరోలుగా పోలీస్ - పోలీస్
బుధవారం, 7 జనవరి 2009   ( 15:08 IST )
Police - police
PC
ఒకరికి ఒకరు ఫేం శ్రీరామ్, పృథ్వీరాజ్ హీరోలగా కమిలినీ ముఖర్జీ, బుజ్జిగాడు చిత్రం ఫేం సంజన హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం పోలీస్ - పోలీస్. పినాంకిల్ పిక్చర్స్ పతాకంపై చందు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మనమోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ తమ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారనేదే ఈ చిత్రంలోని కథ అని అన్నారు. పోలీస్ వ్యవస్థలోని మంచి, చెడును విశ్లేషించేదిగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు.

సమాజంలో చోటు చేసుకున్న కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రూపొందిందని ఆయన పేర్కొన్నారు. నిర్మాత చందూ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన పోలీస్ ఇతివృత్తాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుందన్నారు. ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.

ఫిబ్రవరిలో సంగీతంతోపాటు చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, విక్రమ్, దండపాణి, ఆహుతీప్రసాద్, ప్రసాద్‌బాబు, అమిత్, గిరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్- శ్రీకరప్రసాద్, సంగీతం- విశ్వ, సాయికార్తీక్, ఆర్ట్- పి.ఎస్. వర్మ, సినమాటోగ్రఫీ- భరణి కె. ధరన్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
నెలాఖరులోగా మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు చిత్రం
విడుదలైన రోషం ఆడియో
ఆలీబాబా 40 దొంగలు డీవీడీ విడుదల
టాలీవుడ్‌లోనూ నటిస్తాను: జెనీలియా
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...