యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
బుధవారం, 7 జనవరి 2009   ( 15:04 IST )
Sirabanu
PC
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం టిక్..టిక్..టిక్. యువర్ టైమ్ స్టార్ నౌ అనేది ఈ చిత్రానికి శీర్షిక. ఈ చిత్రం ద్వారా అరుణకాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అరుణోదయా ఫిల్మ్‌వర్క్స్ పతాకంపై అరుణకుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ నేటి ట్రెండ్‌కు తగ్గట్టు సరికొత్త కథ, కథనాలతో మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో ప్రత్యేకపాత్రలో కన్పించనున్నట్టు ఆయన చెప్పారు. మణిశర్మ వద్ద సహాయకుడిగా పనిచేసిన కానూరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారని ఆయన అన్నారు.

కృష్ణభగవాన్, వేణుమాధవ్‌ల క్యారెక్టర్లు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో శంకర్‌దాదా అనే రౌడీ క్రికెట్ టీమ్‌కు కోచ్‌గా భగవాన్‌సింగ్ ధోనీ పాత్రలో కృష్ణభగవాన్ నవ్వులు పంచనున్నారు. చంద్రమండలం మీద గజం కోటి రూపాయలకు అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారి పాత్రలో వేణుమాధవ్ తన కామెడీని కురిపించనున్నట్టు ఆయన అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా- ఎస్.డి. జాన్, మాటలు- సీతారామరాజు, పాటలు- రాంబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- అరుమకాంత్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నెలాఖరులోగా మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు చిత్రం
విడుదలైన రోషం ఆడియో
ఆలీబాబా 40 దొంగలు డీవీడీ విడుదల
టాలీవుడ్‌లోనూ నటిస్తాను: జెనీలియా
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...