|
| విడుదలైన రోషం ఆడియో |
శ్రీకృష్ణ, మమత హీరోహీరోయిన్‌లుగా పెండెం బాలకృష్ణ నిర్మాణంలో సమీ దర్శకత్వంలో రూపొందిన రోషం చిత్రం ఆడియో విడుదలయింది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఆడియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వి సముద్ర, అనిల్‌కృష్ణ తదితర దర్శకులు హాజరయ్యారు.
నిర్మాత మాట్లాడుతూ, రెండేళ్ల తమ శ్రమ ఈ స్థితికి రావడం ఆనందంగా ఉందన్నారు. సినిమా నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులో తెలుసుకోగలిగాను. ఒకానొక సమయంలో సినిమా ఆగిపోతే హీరోయిన్ మమత తన దగ్గరున్న బంగారాన్ని తాకట్టుపెట్టి మరి తిరిగి ముందుకెళ్లేలా చేసింది.
ఈ చిత్రం ఆడినా ఆడకపోయినా దీని కోసం పని చేసిన వారందరికీ మంచి అవకాశాలు రావాలని తాను మన:స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు సాల్మన్ మాట్లాడుతూ, రీరికార్డింగ్‌కు చక్కటి అవకాశమున్న ఈ చిత్రం తప్పక విజయవంతమవుతుందన్నారు. ప్రేమ, యాక్షన్ అంశాలతో కలిగి ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు హీరో కృష్ణ వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|