యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
5 జనవరి 2009   ( 12:38 IST )
jagapathibabu
PC
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జగపతిబాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి జగపతిబాబు మాట్లాడుతూ ఎన్‌‍కౌంటర్ చేస్తేనే నేరగాళ్లు తగ్గుతారని అప్పుడే వారిలో భయం పుడుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

తన అభిప్రాయానికి తగ్గ పాత్రనే ఈ సిద్ధం చిత్రంలో తాను పోషిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు జేడీ మాట్లాడుతూ జగపతిబాబు పాత్ర పేరు దయ అని తెలిపారు. ఈ కథను రాంగోపాల్‌వర్మ అందించారని ఆయన పేర్కన్నారు. ఈ చిత్రంలోని దయాపాత్రకు ప్రేరణ అయిన దయానాయక్‌తో తాము చర్చించామని చావడం కన్నా చంపడం చాలా కష్టమని దయానాయక్ తమతో అన్నారని జేడీ అన్నారు. ఆయన ప్రతిరోజూ దేవున్ని పూజిస్తూ తాను ఆరోజు ఎవరినీ చంపకూడదని అనుకునేవారట అని జేడీ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ హోమం తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించామని చక్కని టీంతో చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రాధారవి, ముఖుల్‌దేవ్, కోటశ్రీనివాసరావు, శివప్రసాద్, నర్సింగ్‌యాదవ్, అపర్ణ, బేబి శివానీ, భరత్ తదితరులు నటిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టాలీవుడ్‌లోనూ నటిస్తాను: జెనీలియా
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
ఎఫ్ఎం రేడియో ద్వారా మస్త్ ఆడియో ప్రీమియర్
ఆకాష్ హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్ చిత్రం
నితిన్ హీరోగా తండ్రీ కొడుకుల కథతో ద్రోణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...