యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
సోమవారం, 5 జనవరి 2009   ( 12:35 IST )
Na girl friend baga rich
PC
శివాజీ, కావేరీఝూ జంటగా బ్రహ్మానందం కామెడీ విలన్‌గా రూపొందిన నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ చిత్రం ఆడియో విడుదలైంది. ప్రసాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఆడియో కాసెట్‌ను విడుదల చేయగా అల్లరి నరేష్ ఆడియో సీడీని విడుదల చేశారు.

ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో తాను, శివాజీ సినిమాలు ఎక్కువగా చేస్తున్నామన్నారు. క్రేన్ ఆపరేటర్‌గా ఉండి నిర్మాతగా ఎదిగి ఈ చిత్రాన్ని నిర్మించిన కుమార్‌కు ఈ చిత్రం విజయాన్ని అందించాలని ఆయన కోరారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను మైక్‌టైసన్ అనే పాత్రను పోషించానని ఇది చాలా వైవిధ్యమైన పాత్ర అని తనపై పాటను కూడా చిత్రీకరించారని తెలిపారు.

ఈ చిత్రానికి మంత్ర ఆనంద్ చక్కని ట్యూన్లు సమకూర్చారని ఆయన పేర్కొన్నారు. ఆనంద్ మాట్లాడుతూ మంత్ర, ఇంధుమతి వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు పనిచేసి వెంటనే కామెడీ చిత్రానికి చేయడం మొదట్లో కాస్త భయం కలిగించిందని అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంపై చేసిన పాట చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

హీరో శివాజీ మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మాతలకు మంచి విజయాన్ని అందించాలని అన్నారు. దర్శకుడు ఎం. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ పాటలు హిట్ అయితే సినిమాకు ప్లస్‌ అవుతుందని అన్నారు. బ్రహ్మానందం పాత్ర సినిమాకు ఆకర్షణ అని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
ఎఫ్ఎం రేడియో ద్వారా మస్త్ ఆడియో ప్రీమియర్
ఆకాష్ హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్ చిత్రం
నితిన్ హీరోగా తండ్రీ కొడుకుల కథతో ద్రోణ
కింగ్ వీడియో పైరసీ అరికట్టండి: నిర్మాత
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు శుభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...