యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
శనివారం, 3 జనవరి 2009   ( 12:40 IST )
Nag, trisha
PC
నాగార్జున హీరోగా తాజాగా విడుదలైన కింగ్ చిత్రంలోని బ్రహ్మానందం పాత్ర సంగీత దర్శకుడు చక్రిని ఉద్ధేశించింది కాదని ఆ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల పేర్కొన్నాడు. తాను చక్రి కలిసి ఢీ చిత్రానికి పనిచేశామని ఆ సందర్భంగా చక్రి తనకు ఎంతగానో సహకరించాడని శ్రీనువైట్ల తెలిపారు.

కింగ్ చిత్రంలో బ్రహ్మానందం పోషించిన సంగీత దర్శకుడి పాత్రను తాను సృష్టించలేదని కథ పరంగా రచయితలు గోపీమోహన్ ఆ పాత్రను రూపొందించారని శ్రీనువైట్ల తెలిపారు. చిత్రంలోని పాత్ర వ్యవహరించే తీరు చక్రి జీవనశైలికి దగ్గరగా ఉందని అందువల్ల అది చక్రిని ఉద్ధేశించి తీసినదేనని కొన్ని వెబ్‌సైట్‌లు రాయడం గురించి ఈ సందర్భంగా శ్రీనువైట్ల ప్రస్తావించారు.

వెబ్‌సైట్ అలా రాసిన కారణంగానే మనస్తాపం చెందిన చక్రి ఆ విషయాన్ని గీతరచయిత రామజోగయ్య ముందు తన బాధను వ్యక్తం చేశారని ఆ విషయం తెలిసే తాను పత్రికలవారి ముందుకు వచ్చానని శ్రీనువైట్ల పేర్కొన్నారు. తాను తీసిన కింగ్ చిత్రంలోని పాత్రకు చక్రికి ఏమాత్రం సంబంధంలేదని ఏవేవో ఊహించుకుని ఇలా రాయడం మానుకోవాలని ఆయన పత్రికలవారిని కోరారు.

అదే సమయంలో తాను ఊహించిన దానికంటే ఎక్కువగానే కింగ్ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయని శ్రీనువైట్ల అన్నారు. ఈ చిత్రంలోని కొన్ని పాత్రల పేర్లు సైతం ఎవరినీ ఉద్ధేశించినవి కావని శ్రీనువైట్ల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎఫ్ఎం రేడియో ద్వారా మస్త్ ఆడియో ప్రీమియర్
ఆకాష్ హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్ చిత్రం
నితిన్ హీరోగా తండ్రీ కొడుకుల కథతో ద్రోణ
కింగ్ వీడియో పైరసీ అరికట్టండి: నిర్మాత
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు శుభం
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...