|
| దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ |
| 29 డిసెంబర్ 2008 ( 15:38 IST ) | |
రామ్, షీలా, హాన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "మస్కా". బి.గోపాల్ దర్శకుడు. ఎంఎస్ రాజు నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. డాక్టర్ దాసరి నారాయణరావు ఆడియోసీడీని విడుదల చేయగా, డి.సురేష్‌బాబు తొలి క్యాసెట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాసరి మాట్లాడుతూ.. యువ హీరోల్లో రామ్ ఎనర్జీ బాగుందన్నారు. ఎంఎస్ రాజు మంచి టీముతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎస్ రాజు వంటి చక్కటి నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలని చెప్పారు. నిర్మాత అనేవాడు సినిమాలో ఎంతవరకు జోక్యం చేసుకోవాలో ఎంఎస్ రాజును చూసి నేర్చుకోవాలన్నారు.
బి.గోపాల్‌కు మంచి సక్సెస్ రావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ హాన్సిక మాట్లాడుతూ.. రామ్ చిత్రంలో బాగా నటించారు. దేశముదురు తర్వాత చక్రి సంగీత దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. ఇంతకుముందు రెండు చిత్రాలు చేసినదాని కంటే ఎంఎస్ రాజుతో పనిచేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉందని హీరోయిన్ చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|