|
| 3 నుంచి కొమరం పులి తాజా షెడ్యూల్ |
| 29 డిసెంబర్ 2008 ( 15:37 IST ) | |
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా, ఖుషి ఫేం ఎస్‌జే సూర్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "కొమరం పులి". కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత శింగనమల రమేష్‌బాబు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని దర్శకుడు చెప్పారు.
జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే షెడ్యూల్‌తో టాకీ పార్టు మొత్తం పూర్తవుతుందని, నాలుగు పాటలు మాత్రమే మిగిలివుంటాయని తెలిపారు. మార్చిలో ఈ పాటల చిత్రీకరణ జరుపుతామన్నారు. సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేస్తామన్నారు. "ఖుషి" తరువాత సూర్య-పవన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిదే.
అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నిఖిష అనే కొత్త హీరోయిన్ పవన్‌కు జంటగా నటిస్తోంది. మనోజ్‌బాజ్‌పేయి, చరణ్‌రాజ్, శరణ్య, నాజర్, అలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, ఫొటోగ్రఫీ: బినోద్ ప్రధాన్, ఫైట్స్: విజయన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: కోలా భాస్కర్, ప్రొడక్షన్ కంట్రోలర్: కిషోర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: సత్యం, రాంబాబు, చౌదరి, నిర్మాత: శింగనమల రమేష్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌జే సూర్య.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|