|
| సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్ |
| 29 డిసెంబర్ 2008 ( 15:37 IST ) | |
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రభుసాల్మన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డి.వై.చౌదరి, వి.మహేష్‌బాబు నిర్మాతలు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు.
లవ్, యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్ అంశాలతో ఈ సినిమా రూపొందిందని వెల్లడించారు. కాలేజీ చదువు ముగించుకొని చెన్నై చేరుకున్న ఒక యువకుడు అనుకోకుండా, బద్ధశత్రువులైన ఇద్దరు డాన్‌ల మధ్య ఎలా చిక్కుకున్నాడన్నదే ఈ చిత్ర కథాంశమని తెలిపారు.
తనను తాను కాపాడుకోవడం కోసం ఆ యువకుడు 16 రోజులపాటు ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నది చాలా ఆసక్తికరంగా తెరకెక్కించామని దర్శకుడు వెల్లడించారు. ఛార్మి పాత్ర వైవిధ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఈ సినిమాలో ఉన్నత సాంకేతిక ప్రమాణాలను ఉపయోగించామన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|