|
| కోకిల, సంకీర్తన దర్శకుడి కాఫీ బార్ |
| 29 డిసెంబర్ 2008 ( 15:37 IST ) | |
"కోకిల", "సంకీర్తన" చిత్రాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ "కాఫీ బార్" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్లూఫాక్స్ సినిమా పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంగీతం కూడా గీతాకృష్ణ సమకూరుస్తున్నారు. వనమాలి రాసిన సాహిత్యంతో ఇప్పటివరకు మూడు పాటల రికార్డింగ్‌ను పూర్తి చేశారు.
కొత్తపాత నటీనటుల కలయికతో రూపొందుతున్న తాజా చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయన్నారు. కొత్త కథనం, మంచి సంగీతం, పాటలు, నయనాందకర ఫొటోగ్రఫీ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సినిమా షూటింగ్‌ను జనవరి 15న ప్రారంభించనున్నట్లు దర్శకుడు తెలిపారు.
గీత రచయిత వనమాలి మాట్లాడుతూ.. గీతాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన "టైమ్"తోనే తన కెరీర్ ప్రారంభమైన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రాల్లో సాహిత్యానికి పెద్దపీట వేస్తారు. పూర్తి వినోదాత్మకంగా సాగే తాజా చిత్రం సరికొత్త ట్రెండ్ సృష్టింస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రకాష్, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: గీతాకృష్ణ.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|