|
| కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం లోగో ఆవిష్కరణ |
| 23 డిసెంబర్ 2008 ( 18:45 IST ) | |
సిద్ధార్థ, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". కిషోర్ కుమార్ దర్శకుడు. ఆయనకు ఇదే తొలి చిత్రం. నల్లమలుపు బుజ్జి నిర్మాత. ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. హాస్యనటుడు బ్రహ్మానందం, హీరో సిద్ధార్థ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. దర్శకుడు మానవీయ విలువలను అద్భుతంగా చిత్రీకరించాడన్నారు. ఇందులో తాను క్రికెట్ ప్లేయర్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. పతాక సన్నివేశంలో సిద్ధార్థ ఫెర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ప్రతిభ ఎక్కడ ఉంటే, అక్కడ గేలం వేసే నిర్మాత బుజ్జి అని వ్యాఖ్యానించారు.
చిత్ర నిర్మాణ సారథి డి.సురేష్‌బాబు మాట్లాడుతూ.. సిద్ధార్థ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో హెయిర్‌స్టైల్‍ను కొత్తగా చూపారు. ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. సినిమాను జనవరిలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఆడియో ట్రెండ్ సృష్టిస్తుందని హీరో సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణుమాధవ్, రఘుబాబు, సుధ, హేమ, కరుణ, రవళి, సామ్రాట్, కళ్యాణి తదితరులు మిగిలిన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: అబ్బూరి రవి, రచన సహకారం: హరీష్ శంకర్, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, విక్రమ్ సిరి, కెమెరా: విజయ్ కె. చక్రవర్తి, సంగీతం: శంకర్, ఎషాన్‌లోయ్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|