|
| సత్యమేవజయతే పాట చిత్రీకరణ |
| 23 డిసెంబర్ 2008 ( 18:45 IST ) | |
రాజశేఖర్, సంజన, నీతుచంద్ర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సత్యమేవజయతే". సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.సత్యనారాయణ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటిస్తుండటం గమనార్హం. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో శివానీ శివాత్మిక మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం ఈ సినిమాలోని ఒక పాటను అమ్మ రాజశేఖర్ నృత్యదర్శకత్వంలో రాజశేఖర్, నీతుచంద్రలపై రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు. "ఎవడైతేనాకేంటి" చిత్ర స్ఫూర్తితో ఈ చిత్రానికి కూడా కథ, స్క్రీన్‌ప్లే రాశానని రాజశేఖర్ తెలిపారు. "అంకుశం" తరహాలో సాగే ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇదని చెప్పారు.
80 శాతం షూటింగ్‌ను రామోజీ ఫిలింసిటీలోనే జరిపాము. సమాజంలోని ఒక బర్నింగ్ ప్లాబ్లమ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తీవ్రవాదం, బాంబు బ్లాస్టులు, అమ్మాయిలను టీజ్ చేయడం వంటి వర్తమాన అంశాలతో రూపొందించాం. పోలీసు వ్యవస్థలోని ప్లస్, మైనస్‌లను ఎత్తిచూపెడుతున్నామని రాజశేఖర్ వెల్లడించారు.
సినిమాను జనవరి 14న విడుదల చేస్తామన్నారు. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. దీన్ని కూడా నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తామని రాజశేఖర్ తెలిపారు. టైటిల్ సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందన్నారు. నాని సంగీత దర్శకుడు. శివాజీ, సాయికిరణ్, శివారెడ్డి, షాయాజీ షిండే, అతుల్ కులకర్ణి, మిలింద్ సోమన్, ఆహుతి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో మిగిలిన పాత్రలు పోషించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|