|
| అజయ్ హీరోగా సారాయి వీర్రాజు |
| 23 డిసెంబర్ 2008 ( 18:45 IST ) | |
విలన్‌గా పలు చిత్రాల్లో నటించి, మంచి నటుడిగా గుర్తింపు పొందిన అజయ్ "సారాయి వీర్రాజు"తో హీరోగా మారుతున్నాడు. రాజమౌళి దగ్గర పనిచేసిన డీఎస్ కణ్ణన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పోస్టర్లు, బ్యానర్లను ఇటీవల విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, వి.వి.వినాయక్, తమ్మారెడ్డి భరద్వాజ, రాధాకృష్ణ, నటుడు శ్రీకాంత్, చిత్ర నిర్మాత పి.ఆర్.కె.రావు తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు.
మొదటి షెడ్యూల్‌ను సిటీ బ్యాక్‌డ్రాప్‌తోనూ, రెండో షెడ్యూల్‌ను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తోనూ సాగుతుందన్నారు. సినిమాను మేలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. నెగెటివ్ రోల్స్ చేయడానికే ఇండస్ట్రీకి వచ్చానని అజయ్ తెలిపారు. హీరో అవతానని అనుకోలేదు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు రావ్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విశ్వ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: సెల్వన్, నిర్మాత: పిఆర్‌కె రావ్, కథ, చిత్రానువాదం, సంభాషణలు, దర్శకత్వం: డీఎస్ కణ్ణన్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|