|
| సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం |
| గురువారం, 4 డిసెంబర్ 2008 ( 13:54 IST ) | |
సర్దార్ పటేల్, సురేష్, మహేష్, విను, వివేక్, ప్రవీణ్, దినేష్, గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా ఎస్.రాజశేఖర్ అనే నూతన నిర్మాత చిత్ర నిర్మాణం చేపట్టారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం ఉదయం ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రారంభం అయింది. రాజ్.కె.ఎస్.గోపి దర్శకుడు.
ముహూర్తపు షాట్‌కు హీరో వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, మరో హీర్ గోపీచంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రారంభోత్సవం మాదిరిగానే, సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుందని శ్రీను చెప్పారు.
ఈ సినిమాలో ఎనిమిది హీరోలు, ఒక హీరోయిన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అందరినీ కొత్తవారినే పరిచయం చేస్తున్నారు. కొంచెం కొత్తగా ఉంటూ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. త్వరలోనే సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. గణ అనే నూతన సంగీత దర్శకుడు ఈ చిత్రాని సంగీతం సమకూరుస్తున్నారు.
పదిహేను రోజుల్లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు కెమెరా: రమణతోట, ఎడిటింగ్: రాజగోపాల్, ఆర్ట్: రామ్‌గోపి, కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాజ్.కె.ఎస్.గోపి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|