|
| సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు మరణం |
| బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 16:15 IST ) | |
ప్రముఖ సినీ నిర్మాత తిరుమల త్రివిక్రమరావు (67) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా అస్వస్తతతో బాధపడుతున్న ఆయన ఈ రోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఒక కుమార్తె ఉక్రేయిన్‌లోనూ, కుమారుడు అమెరికాలో ఉండటం వలన ఆయన అంత్యక్రియలు ఈ నెల 6న జరుగుతాయి. విశాఖపట్నానికి చెందిన త్రివిక్రమరావు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. శోభన్‌బాబు హీరోగా "మొనగాడు" చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన తరువాత ఒక తమిళ చిత్రాన్ని "పొట్టేలు పున్నమ్మ" (మురళీమోహన్, శ్రీప్రియ)గా రీమేక్ చేశారు.
అనంతరం ఎన్టీఆర్‌తో తీసిన "జస్టిస్ చౌదరి" చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. యువరత్న బాలకృష్ణ నటించిన "బొబ్బిలి సింహం", "రౌడీ ఇన్‌స్పెక్టర్" చిత్రాలు కూడా త్రివిక్రమరావు నిర్మించారు. కృష్ణంరాజుతో "రగిలేజ్వాల", కృష్ణ, కృష్ణంరాజు కాంబినేషన్‌లో "యుద్ధం", చిరంజీవితో గూఢచారి నెం.1, దొంగ, కొండవీటి దొంగ, చిత్రాలను తీర్చిదిద్దారు.
ఆయన చివరిగా తెలుగులో పవన్‌కళ్యాణ్- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో "బద్రి" చిత్రాన్ని నిర్మించారు. అది ఘన విజయం సాధించింది. అనంతరం ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేశారు. జితేంద్రతో పలు హిందీ చిత్రాలను కూడా నిర్మించారు.
క్రమశిక్షణ గల నిర్మాతగా చిత్ర పరిశ్రమలో మంచి పేరు పొందిన ఆయన మృతి చెందటం పట్ల తెలుగు నిర్మాతల మండలి సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, సమాచార మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|