యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 15:56 IST )
Raja, Manjari
PC
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. కాలం మనిషి జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాజా, మంజరి ఫడ్నిస్, రిచాపై ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించారు.

కళ్యాణ్ పల్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకుడు. షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ.. "వెన్నెల" తీసిన టీంతో మళ్లీ ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏడు పాత్రల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని వెల్లడించారు. ఈ ఏడు పాత్రల్లో నటించేవారందరూ హీరోలే.. అందరూ విలన్లేనని రాజా వివరించారు.

డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న తనకు ఎప్పటి నుంచో సినిమా తీయాలని కోరిక ఉందని, ఇప్పటికి అది నెరవేరుతోందని నిర్మాత కళ్యాణ్ తెలిపారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కాలేజీ పూర్తి చేసిన ఏడుగురు స్టూడెంట్స్ జీవితాల్లో జరిగిన సంఘటనల ఇతివృత్తంగా సినిమా రూపొందుతోందని దర్శకుడు సుమన్ వెల్లడించారు.

ఈ సినిమాలో రవివర్మ, వెన్నెల కిషోర్, సాందీప్, రావురమేష్, భార్గవి, సైరాభాను తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహేష్ శంకర్, పాటలు: వనమాలి, ఆర్ట్: కె.మురళీధర్, సినిమాటోగ్రఫీ: రంగనాథ్ బాబు, మాటలు: నాగరాజు గంధం, కథ, స్క్రీన్‌ప్లే: రాజ్, డి.కె.సీతామీనన్, సహనిర్మాత: రవి పెండేకంటి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యతార్థ సంఘటన ఆధారంగా కళాశాల
కొత్త నటుడితో ఈతరం సినిమా
షూటింగ్ పూర్తి చేసుకున్న సొంత ఊరు
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
సారాయి వీర్రాజులో హీరోగా అజయ్
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...