యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
3 డిసెంబర్ 2008   ( 15:41 IST )
Kalasala
PC
విద్యార్థుల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలతో రూపొందిన "కళాశాల" అనే చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. "ప్రేమిస్తే" చిత్రానికి ప్రాణం పోసిన శక్తివేల్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. కాగా, ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను నిర్మించారు.

తమిళనాడులోని ధర్మపురి పట్టణంలో ఓ కళాశాలలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా చేసుకొని తమిళంలో రూపొందిన "కల్లూరి" సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో అందరూ కొత్త నటీనటులే. ఈ తమిళ చిత్రాన్ని "కళాశాల" పేరుతో ఎంవి గోపాలరావు తెలుగులోకి అనువదిస్తున్నారు.

జ్యోతి ఆర్ట్స్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర వివరాలను గోపాలరావు వెల్లడిస్తూ.. జీవితంలో ప్రేమ గొప్పదా... స్నేహం గొప్పదా... అనే అంశంతో శక్తివేల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని చెప్పారు. కాలేజీలో కాలుమోపిన యువతీయువకులు ముందుగా తామెవరో ఏమిటో పరిచయం చేసుకుంటారు.

కాలం తెచ్చే మార్పుల్లో కొందరు ఒకరికొకరు అవతారు. అయితే ప్రేమికులు కావడానికి ముందు మనసుల్లో ప్రేమ ఉన్నా దాన్ని బైటకు రానివ్వకుండా దాచుకుంటారు. అయితే ఆ ప్రేమ ఎప్పుడు... ఎలా బయటకువచ్చిందనేదే ఈ చిత్ర ఇతివృత్తం.

ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిక్సింగ్ జరుగుతోంది. త్వరనే తొలికాపీ సిద్ధం అవుతుందని గోపాలరావు వెల్లడించారు. ఆడియోను ఈ నెల ద్వితీయార్థంలో, సినిమాను నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.

తమన్నా, అఖిల్ జంటగా నటించిన ఈ చిత్రంలో మిగిలిన పాత్రలన్నీ కొత్తవాళ్లే చేశారు. ఈ సినిమాకు మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: భువనచంద్ర, శివగణేష్, సాహితి, సంగీతం: జోష్వాశ్రీధర్, ఛాయాగ్రహణం: చెళియన్, ఎడిటింగ్: శశికుమార్. కళ: మైల్ కృష్ణన్, నిర్మాత: ఎంవి.గోపాలరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాజీ శక్తివేల్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు మరణం
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
కొత్త నటుడితో ఈతరం సినిమా
షూటింగ్ పూర్తి చేసుకున్న సొంత ఊరు
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
సారాయి వీర్రాజులో హీరోగా అజయ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
యతార్థ సంఘటన ఆధారంగా కళాశాల
విద్యార్థుల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలతో రూపొందిన "కళాశాల" అనే చిత్రం త్వరలో...
కొత్త నటుడితో ఈతరం సినిమా
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...