|
| సారాయి వీర్రాజులో హీరోగా అజయ్ |
| మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 15:57 IST ) | |
రజనీకాంత్, చిరంజీవి, శ్రీకాంత్, గోపీచంద్... ఇలా చాలా మంది హీరోల మూలాలు ప్రతినాయక పాత్రల్లో వెతుక్కోవచ్చు. వీరందరూ కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకులుగా మెప్పించి... అనంతరం హీరోలు అయినవారే. తాజాగా అజయ్ కూడా ఇదే దారిలో వెళుతున్నాడు.
మెదట్లో హీరో స్నేహితుడిగా కొన్ని చిత్రాల్లో నటించి... "విక్రమార్కుడు" చిత్రంతో అజయ్ పూర్తిస్థాయి విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో విలన్‌గా అందరి మెప్పు పొందాడు. తరువాత వచ్చిన "లక్ష్మీ కళ్యాణం" చిత్రం సక్సెస్ చవిచూడకపోయినా, విలన్‌గా అజయ్‌కు మంచి గుర్తింపు లభించింది.
ఇప్పుడు అజయ్ హీరోగా నటించబోతున్న చిత్రం "సారాయి వీర్రాజు". ఈ సినిమా నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు కన్నన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమాలో అజయ్ సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. ఒక హీరోయిన్‌గా మలయాళ నటి రమ్యా నంబిసన్ ఎంపికైంది. మిగిలిన ఇద్దరి కోసం అన్వేషణ జరుగుతోంది. విశాలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|