|
| మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల |
| సోమవారం, 1 డిసెంబర్ 2008 ( 16:41 IST ) | |
రఘుబాబు, శివాజీరాజా, బ్రహ్మానందం, గీతాసింగ్, రాఖీ, శీతల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "మొండి మొగుళ్లు- పెంకి పెళ్లాలు". కెవి రమణ దర్శకుడు. యనమల బాబిరెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆడియోను ఆవిష్కరించి నెల్లూరు ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినిమా పాటలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారని చెప్పారు. నిర్మాత బాబిరెడ్డికి మంచి అభిరుచి ఉందన్నారు.
గీతాసింగ్ గ్రేసీ సింగ్‌లాగా డాన్స్ చేసిందన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ఇటువంటి చిత్రాలు సక్సెస్ కావాలని ఆకాక్షించారు. ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమాలు సమాజానికి మేలు చేయాలన్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నానన్నారు. సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|