|
| రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు |
| సోమవారం, 1 డిసెంబర్ 2008 ( 15:51 IST ) | |
డాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా "నా స్టైలే వేరు" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. జి.రామ్‌ప్రసాద్ దర్శకుడు. మాగంటి గోపీనాథ్ నిర్మాత. చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. కథ, కథనాల్లో కొత్తదనం, కథానాయకుడి పాత్రస్వరూపం, స్వభావాలు కొత్తగా కనిపిస్తాయని వెంకట్ చెప్పారు.
తన జీవితంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా హీరో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నడు... అలా మార్పుకు గురైన జీవితంలోకి ఓ అమ్మాయి అడుగుపెడితే, హీరో జీవితం మళ్లీ ఎటువైపు వెళ్లింది... అనేది ప్రధానాంశమన్నారు. రాజశేఖర్‌తో మాస్‌తో కూడిన కామెడీని పండించడం తనకొక సవాలని వెంకట్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే డిసెంబరు 15 నుంచి తాజ్ షెడ్యూల్ ప్రారంభిస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, విజయ్‌కుమార్, దేవరాజ్, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, జీవా, బెనర్జీ, విజయరంగరాజు, పృథ్వీరాజ్, అమిత్, ఎం.ఎల్.ఎ సాయన, జయవాణి, అనిత తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: దిసిర ప్రొడక్షన్ యూనిట్, కథా సహకారం: గోపీ మోహన్, కెమెరా: ఎస్.అరుణ్‌కుమార్, సంగీతం: అనూప్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, చిర్రావూరి ఆజకుమార్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|