|
| కుబేరులకు సెన్సార్ పూర్తి |
| సోమవారం, 1 డిసెంబర్ 2008 ( 15:41 IST ) | |
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం "కుబేరులు". ఈ సినిమా టైటిల్‌కు "వీళ్లకు అన్నీ అప్పులే" అనే ఉప శీర్షికను జోడించారు. ఈ సినిమాలో అలీ, కృష్ణ భగవాన్‌లు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
గోదావరి టాకీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. తమ చిత్రానికి "యు" సర్టిఫికేట్ లభించిందని దర్శకుడు వెల్లడించారు. సినిమాను కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దామని తెలిపారు. తమ ప్రయత్నం విజయవంతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
మొదట సినిమాను డిసెంబరు నెలాఖరులో విడుదల చేద్దామనుకున్నాం. అయితే డిసెంబరు 4 అయితే బాగుంటుందని భావించే, అదే తేదీని ఖరారు చేశామని నిర్మాతలు తెలిపారు. సీనియర్ నటి జ్యోతిలక్ష్మి ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేశారు. సినిమా పది నిమిషాల్లో అయిపోతుందనగా ఈ పాట వస్తుందని నిర్మాతలు చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|